Skip to main content

Govt Scholarships: తపాలా శాఖ–స్పర్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల..

Deen Dayal Sparsh Yojana Scholarship Notification

భారతీయ తపాలా శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి దీన్‌ దయాళ్‌ స్పర్ష్‌ యోజన స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. హాబీగా స్టాంపులలో అభిరుచి, పరిశోధనలో ప్రోత్సాహం కోసం తెలంగాణలోని ఆరో తరగతి–తొమ్మిదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం స్కాలర్‌షిప్‌లు: 920(ప్రతి పోస్టల్‌ సర్కిల్‌కు 40 స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు)
స్కాలర్‌షిప్‌ మొత్తం: ఏడాదికి రూ.6000 (నాలుగు త్రైమాసికాల్లో రూ.1500 చొప్పున).
అర్హత: ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు. వీరికి మంచి అకడమిక్‌ రికార్డుతో పాటు తపాలా బిళ్లల సేకరణ హాబీ ఉండాలి. స్కాలర్‌షిప్‌ సమయంలో అభ్యర్థులు ఫైనల్‌ ఎగ్జామ్స్‌లో కనీసం 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌ పాయింట్‌ను సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రెండు స్థాయిల్లో ఎంపికచేస్తారు. 1. ఫిలాటెలీ రిటన్‌ క్విజ్, 2. ఫిలాటెలీ ప్రాజెక్ట్‌. వీటి ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: దరఖాస్తును అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఫిలాటలీ),K/K చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్, తెలంగాణ సర్కిల్, డాక్‌ సదన్, అబిడ్స్, హైదరాబాద్‌–500001 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 26.08.2022

వెబ్‌సైట్‌: http://tsposts.in

Last Date

Photo Stories