Skip to main content

KGBV Recruitment 2024: కేజీబీవీలో ఖాళీలు.. 1:3 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన

KGBV Recruitment 2024 Kasturbha Gandhi Ba Likala Vidyalayas vacancy announcement Contract positions available at KGBV Adilabad EducationDepartmentJobs

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని కస్తూర్భా గాంధీ బా లికల విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. కేజీబీవీతో పాటు యూఆర్‌ఎస్‌లో పోస్టులను భర్తీ చేయనున్నారు. సీఆర్టీ, పీజీసీఆర్టీ, పీఈ టీ, స్పెషల్‌ ఆఫీసర్‌, నర్సింగ్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిన భర్తీ చేయనున్నారు.

1ః3 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలన
2023లో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన పరీక్షలో సీనియారిటీ జాబితాలో ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత తెలిపారు. 1ః3 పద్ధతిలో సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను పిలవనున్నారు. 21న ఉదయం 11:30 గంటలకు డీఈవో కార్యాలయంలో అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు.

UPSC Mains 2024 Exams: నేటి నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు..

సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అదేరోజు 1ః1 జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు డీఈవో పేర్కొన్నారు. 22న అభ్యంతరాల స్వీకరణ, 23న వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టనున్నారు.

47 ఖాళీలు..

జిల్లాలోని 18 కేజీబీవీల్లో 47 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సీఆర్టీ బయోసైన్స్‌ 1, ఇంగ్లిష్‌ 2, హిందీ 3, తెలుగు 2, గణితం 4, ఫిజికల్‌ సైన్స్‌ 3, పీఈటీ 1, పీజీసీఆర్టీలో ఇంగ్లిష్‌ 5, గణితంలో 2, నర్సింగ్‌లో 5, తెలుగులో 2, బాటనీలో 5, కెమిస్ట్రీలో 2, సివిక్స్‌లో 1, కామర్స్‌లో 1, ఎకనామిక్స్‌లో 1, ఫిజిక్స్‌లో 1, జువాలజీలో 3, స్పెషల్‌ ఆఫీసర్‌ 2, యూఆర్‌ఎస్‌లో సైన్స్‌ 1 పోస్టు ఖాళీగా ఉన్నాయి.

Unemployment Scheme: నిరుద్యోగ భృతికి దరఖాస్తుల ఆహ్వానం

అయితే 19 పోస్టులు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో క్యారీఫార్వర్డ్‌ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 27 పోస్టులు భర్తీ కానున్నట్లు సమాచారం.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 20 Sep 2024 01:41PM

Photo Stories