Skip to main content

ISRO Opportunity: విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న గొప్ప అవకాశం..

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా యువికా–2024 లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది. ఈ మెరకు దరఖాస్తులు చేసుకునేందుకు అర్హతలను వెల్లడించారు..
Ninth class students of Kancharam school with their project  Yuvika-2024 Eligibility Criteria      Application Form for Yuvika-2024

మంచి అవకాశం

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో మంచి అవకాశం కల్పించింది. ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు చేసుకున్న వారికి క్విజ్‌ రూపంలో పలు ప్రశ్నలు ఉంటాయి. ఇంతటి మంచి అవకాశాన్ని ఆసక్తి ఉన్న 9వ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– పండూరు వేణుగోపాల్‌, భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు, జెడ్‌పీహెచ్‌ఎస్‌, కంచరాం, రాజాం

Free Bus For 10th & Inter Students: టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులకు APSRTC శుభవార్త.. ఉచితంగా ప్రయాణం

రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా యువికా–2024 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించింది. ఇందుకు దేశ వ్యాప్తంగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో ఆహ్వానిస్తుంది. www.isro.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 20 నుంచి మార్చి 20 వరకు అవకాశం కల్పించింది. అర్హులను ఎంపిక చేసి మొదటి జాబితా మార్చి 28న, రెండవ జాబితా ఏప్రిల్‌ 4న ఆన్‌లైన్‌లోనే ప్రకటించనుంది.

Intermediate: విద్యార్థులు సులభంగా పాసయ్యేందుకు (ఈజీ టు పాస్‌) మెటీరియల్‌

దరఖాస్తు చేయండిలా..

విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి దశలో జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.

యువికా–2024 కోసం ఏర్పాటు చేసిన www.isro.gov.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. క్విజ్‌ సూచనలు చదవడం, ఈ–మెయిల్‌ 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ క్విజ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్‌ అప్‌లోడ్‌ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్‌లోని ఆన్‌లైన్‌ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదు చేయాలి. అనంతరం డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుది జాబితా అదే నెల 20న వెబ్‌సైట్‌లో ఉంచుతారు.

 

Group-2 Exam: రేపు జరిగే గ్రూప్‌-2 పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం..

రాష్ట్రానికి ముగ్గురు చొప్పున అవకాశం

ఎంపికైన విద్యార్థులకు విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌ (తిరువనంతపురం), యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌ (బెంగళూరు), స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌), నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (హైదరాబాద్‌), నార్త్‌ ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (షిల్లాంగ్‌), ఐఐఆర్‌ఎస్‌ (డెహ్రాడూన్‌), శ్రీహరికోట అంతరిక్ష కేంద్రాలలో మే 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

AP TET 2024: ఈనెల 27 నుంచి ఏపీటెట్‌,పరీక్ష నిర్వహణ ఇలా..

అర్హులు వీరే....

ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వీరు ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతో పాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని ఉండాలి. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్‌లలో సభ్యులై ఉండాలి. ప్రతి రాష్ట్రం నుంచి విద్యార్థుల భాగస్వామ్యం ఎంత నిష్పత్తిలో ఉండాలో నిర్దారిస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు మార్చి 20 చివరి తేదీగా నిర్ణయించారు.

Published date : 24 Feb 2024 01:21PM

Photo Stories