Group-2 Exam: రేపు జరిగే గ్రూప్-2 పరీక్షకు ఏర్పాట్లు సిద్ధం..
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 25న జరగనున్న గ్రూప్–2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.డి.అనిత తెలిపారు. పరీక్ష ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు జరుగుతుందని, జిల్లాలోని 80 కేంద్రాల్లో 26,452 మంది పరీక్ష రాయనున్నట్టు వెల్లడించారు. 80 కేంద్రాలకు 24 రూట్లుగా విభజించి 24 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగా నియమించామని చెప్పారు.
వీరితో పాటు లైజన్ అధికారులుగా తహసీల్దార్లను నియమించామన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో రూట్, లైజన్ ఆఫీసర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. ప్రశ్న పత్రాలు తీసుకున్న దగ్గర నుంచి పరీక్ష అనంతరం ఆన్సర్ పేపర్లను సబ్‌మిట్ చేసే వరకూ చీఫ్ సూపరింటెండెంట్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఉదయం 9.30 గంటల తర్వాత మెయిన్ గేట్లను మూసివేయాలని, పరీక్ష పూర్తయిన తర్వాత 1 గంటకు అభ్యర్థులను బయటకు విడిచిపెట్టాలని సూచించారు.
Scholarships: విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం
దివ్యాంగులు, గర్భిణులకు వీలున్నంతవరకు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే పరీక్ష రాసేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏపీపీఎస్‌సీ సభ్యుడు శంకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 899 పోస్టుల కోసం 4,83,525 మంది అభ్యర్థులు గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశంలో ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రటరీ వెంకటరావు, ఇతర సిబ్బంది, పలు కళాశాలల, పాఠశాలల యాజమాన్యాలు, చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్, లైజన్ అధికారులు పాల్గొన్నారు.
AP TET 2024: ఈనెల 27 నుంచి ఏపీటెట్,పరీక్ష నిర్వహణ ఇలా..
అభ్యర్థులకు సూచనలు
- హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
- పరీక్ష హాల్‌కు సెల్‌ఫోన్, స్మార్ట్ వాచ్, మరే విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లకూడదు.
- దివ్యాంగత్వం 40 శాతం పైబడిన వారు స్రైబ్‌ను స్వయంగా తీసుకురావచ్చు. అభ్యర్థి విద్యార్హత కంటే తక్కువగా ఉండాలి.
- 80 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 26,452 మంది అభ్యర్థులు
డీఆర్వో ఎస్.డి.అనిత