Inspiring Teachers: ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
ఈ ప్రపంచంలో గురువే సమస్తం. రేపటి పౌరుల బంగరు భవితను అందించే మహత్తర శక్తి ఉపాధ్యాయులకే ఉంది. పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అని చెబుతున్నాయి. రేపటి పౌరుల అందమైన జీవితాల్లో వారు జ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మంది ఉత్తమ ఉపాధ్యాయులు విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తూ జేజేలు అందుకుంటున్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఆదర్శఉపాధ్యాయుడు ప్రేమ్‌చంద్
Inspiring Teachers 2023: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
కోడూరు: మండలంలో ఉపాధ్యాయుడు మన్నె ప్రేమ్‌చంద్ తోటి మాస్టర్లకు ఆదర్శం. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి ప్రేమ్‌చంద్ కృషి చేయడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నారు. మండలంలోని స్వతంత్రపురం ప్రాథమిక పాఠశాలలో ప్రేమ్‌చంద్ 2013లో ప్రధానోపాధ్యా యుడిగా విధుల్లో చేరారు. ఆ పాఠశాలలో కేవలం 21మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రేమ్‌చంద్ తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడానికి గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. స్వతంత్రపురంతో పాటు హరిపురం, ఉల్లిపాలెం, ముందడుగు నుంచి కూడా పాఠశాలలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. 21మంది విద్యార్థుల సంఖ్యను 131కు పెంచి, తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై బలమైన నమ్మకాన్ని కల్పించారు.
Dr. BR Ambedkar University: నూతనంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ (డిగ్రీ బీఎడ్) క్లాస్‌వర్క్
సొంత నిధులు, దాతల సహకారంతో స్థలం కొనుగోలు
రాష్ట్రంలోనే తొలిసారిగా 2018లోనే స్వతంత్రపురం ఎంపీపీ పాఠశాలలో ప్రేమ్‌చంద్ సహకారంతో ఇంగ్లిష్ మీడియం విద్యకు శ్రీకారం చుట్టారు. పాఠశాల పేరును సైతం ‘స్వతంత్రపురం ఆదర్శ పాఠశాల’గా మార్పు చేశారు. దాతలు, ఎన్‌ఆర్‌ఐల సహకారంతో విద్యార్థులకు ఇంగ్లిష్ వర్క్ బుక్స్, మెటీరీయల్స్‌ను అందించారు. పాఠశాల ఆవరణలో ఖాళీ స్థలం లేకపోవడంతో ప్రేమ్‌చంద్ రూ.3 లక్షల నగదుతో విద్యార్థులకు ఉపయోగపడేలా ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. రూ.2.50 లక్షల నగదును దాతల నుంచి సమకూర్చగా, సొంత నగదు రూ.50 వేలను స్థలం కొనుగోలుకు అందించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆటోలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ‘నాడు–నేడు’ పథకం ద్వారా ప్రేమ్‌చంద్ పర్యవేక్షణలో స్వతంత్రపురం పాఠశాలను మరింతగా అభివృద్ధి చేశారు.
Best Teacher Awards 2023: AU మహిళలకు అగ్రాసనం
అవార్డులు, పురస్కారాలు
ప్రేమ్‌చంద్‌కు జిల్లాస్థాయి, మండలస్థాయిలో అనేక అవార్డులు లభించాయి. 2007లో జిల్లా ఉత్తమ రిసోర్స్ పర్సన్‌గా, 2018లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడుగా అవార్డు అందుకున్నారు. 2016, 2018లో మండల ఉత్తమ ఉపాధ్యాయఅవార్డును ప్రేమ్‌చంద్ సొంతం చేసుకున్నారు. స్వతంత్రపురం పాఠశాలలో కల్పిస్తున్న వసతులకు 2022లో ఈ పాఠశాలకు జిల్లా స్వచ్ఛ పురస్కారాన్ని ఇచ్చారు. ఇటీవల బదిలీల్లో ప్రేమ్‌చంద్ మండలంలోని రామకృష్ణాపురం ఎంపీయూపీ పాఠశాలకు బదిలీపై వెళ్లారు. అక్కడ విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
శ్రీ గురుభ్యోనమః తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులదే.. వారి బోధనతో విద్యార్థులకు వెలుగు బాట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి విద్యార్థుల కోసం సొంత నిధులు వెచ్చిస్తున్న వైనం
ఆట, మాట, పాటలే పాఠాలు
హెచ్‌ఎం శ్రీదేవి పెదవేగి మండలం కొప్పాక ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 2000 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన శ్రీదేవి బోర్డుపై నోట్సు రాయడం, పుస్తకాలతో పాఠాలు చెప్పడం విద్యార్థులకు బోరు కొట్టే బోధనా పద్ధతులని గ్రహించారు. విద్యార్థులకు ఎలా శ్రద్ధగా పాఠాలపై దృష్టి కేంద్రీకరిస్తారో అధ్యయనం చేశారు. అప్పటి నుంచి ఆటల ద్వారా, మాటల ద్వారా, పాటల ద్వారా పాఠాలు చెప్పడం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. పిల్లల చేతే బొమ్మలు తయారు చేయించడం, చార్టులపై సంబంధిత పాఠాలు కనిపించేలా ఏర్పాటు చేయడంతో పాఠ్యాంశాలకు ఆకర్షితులయ్యేలా కృషి చేస్తున్నారు.
Best Teacher Awards: ప్రైవేటు ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు
మా మంచి మాస్టారు శంకర్
పోచారం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్న శంకర్
బాన్సువాడ: తరగతి గదిలో కూర్చొని పాఠాలు బోధించడమే కాకుండా స్వయంగా విద్యార్థులను ఫీల్డ్ విజిట్ చేయించి పలు అంశాలపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయుడు శంకర్, విద్యార్థులతో మా మంచి మాస్టారు అనే పేరు తెచ్చుకుంటున్నారు. బాన్సువాడ మండలం పోచారం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శంకర్ ప్రభుత్వం అందజేస్తున్న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎంపికయ్యారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 94 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
Jagananna Videshi Vidya Deevena: పేదింటి బిడ్డకు విదేశీ విద్య.. ‘అమెరికా వెళ్తుందని ఊహించలేదు’
విద్యార్థులకు పాఠాలు పూర్తి స్థాయిలో అర్థమయ్యేలా వస్తువుల రూపంలో, ప్రకృతిని అనుసంధానం చేస్తూ పాఠాలు బోధిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను స్వయంగా పంట పొలాల్లోకి తీసుకెళ్లి వ్యవసాయం, ప్రకృతి గురించి వివరిస్తారు. టీఎల్‌ఎం(టీచర్ లెర్నింగ్ మెటీరియల్) బోధనాలు–ప్రమాణాలు అనే అంశం అవశ్యకతపై సలహాలు, సూచనలు అందిస్తారు. పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో నలుగురు ఉపాధ్యాయులు సొంతంగా వేతనం ఇచ్చి అటెండర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజన అమలుపై దృష్టి సారిస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు. శంకర్ పనితనం చూసి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు. నేడు జిల్లా కలెక్టర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
- విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో
- విద్యా బోధన
- వివిధ అంశాలపై ఫీల్డ్ విజిట్ చేయించి
- అవగాహన కల్పిస్తున్న వైనం
- జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక
Best Teacher Awards: ఉత్తమ అధ్యాపకులఅవార్డులకు ఎంపిక
బోధనలో ‘గురు’తర బాధ్యత: ఆంగ్ల బోధనలో దిట్ట
కై కలూరు: సముద్రుడు మాస్టారు.. ఈ పేరు చెప్పగానే విద్యార్థులకు ఆంగ్లభాష గుర్తుకొస్తుంది. 1998 డీఎస్సీ ద్వారా కై కలూరు మండలం వదర్లపాడు పాఠశాలలో గోల్కొండ సముద్రుడు విధుల్లో చేరారు. భుజబలపట్నం, వెలంపేట, చటాకాయి పాఠశాలల్లో పనిచేసి ప్రస్తుతం భైరవపట్నం పాఠశాలలో ఇంగ్లీషు బోధన చేస్తున్నారు. సముద్రుడు మాస్టారు చిత్రాలతో ఆంగ్ల భాషను అర్థమయ్యే రీతిలో విద్యార్థులకు బోధిస్తున్నారు. ద్రాక్ష చెట్టు, నక్క బొమ్మలను బోర్డుపై చిత్రించి వాటిని ఇంగ్లీషులో చెప్పడం వల్ల తేలిక పద్ధతిలో విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఇంగ్లీషులో మాట్లాడడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. మాస్టారు వద్ద ఇంగ్లీషు నేర్చుకున్న విద్యార్థులు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు.
- శిష్యులను ఉన్నతంగా తీర్చిదిద్దుతూ..
- ఒక్కొక్కరిదీ ఒక్కో బాణీ
- నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
విద్యార్థుల మనసు చూరగొన్న గురువులు
తిరువూరు: తిరువూరు మండలం గానుగపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయుడు ఎం.రాంప్రదీప్ ఆంగ్లభాష అంటే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టడానికి సులభరీతిలో పాఠ్యాంశాలను నేర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆటపాటలతో ఆంగ్ల భాషా బోధన ఆయన ప్రత్యేకత. మన ఊరు మన గ్రంథాలయం కార్యక్రమం నిర్వహించారు. పేద విద్యార్థులు 9 మందికి ఎంబీబీఎస్ చదివేందుకు దాతల నుంచి ఆర్థికసాయాన్ని అందజేశారు. పిల్లలను బడిలో చేర్పించడం, విద్యార్థులకు శస్త్ర చికిత్సలు చేయించడం,
- రచయిత పైడిమర్రి జీవిత విశేషాలౖపై పరిశోధన చేసి తెలంగాణ, ఏపీలో గుర్తింపు పొందారు.
National Science Seminar – 2023: జాతీయ సైన్స్ సెమినార్ పోటీలకు ఆహ్వానం