National Science Seminar – 2023: జాతీయ సైన్స్ సెమినార్ పోటీలకు ఆహ్వానం
Sakshi Education
భువనగిరి : జాతీయ సైన్స్ సెమినార్ – 2023 జిల్లా స్థాయి పోటీలకు ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
National Science Seminar – 2023
ఈనెల 6న మండల స్థాయి పోటీలు ఉంటాయని, అందులో రాణించిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పాల్గొంటారని తెలిపారు. 8,9,10 తరగతుల విద్యార్థులు పోటీల్లో పాల్గొనేలా పాఠశాలల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా స్థాయి పోటీలను ఈనెల 9వ తేదీన భువనగిరిలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి భరణికుమార్ సెల్ నంబర్ 9000989726ను సంప్రదించాలన్నారు.