Best Teacher Awards: ఉత్తమ అధ్యాపకులఅవార్డులకు ఎంపిక
Sakshi Education
సాక్షి, భీమవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు డీఎన్నార్ కళాశాల నుంచి ఇద్దరు అధ్యాపకులు ఎంపికయ్యారు.
డీఎన్నార్ కళాశాలలో పీజీ ఎకనామిక్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ అల్లూరి వెంకట నాగవర్మ, మ్యాథ్స్ అధ్యాపకురాలిగా పనిచే స్తున్న డాక్టర్ బి.జ్యోతిలకు అవార్డు లభించింది. ఇద్దరు అధ్యాపకులు ఈనెల 5న విశాఖపట్నంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు. అవార్డులకు ఎంపికై న అధ్యాపకులకు డీఎన్నార్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు గోకరాజు వెంకట నర్సింహరాజు, గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), పాలకవర్గం, అధ్యాపకులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
Analog Astronaut Dangeti Jahnavi on CM Jagan's Support: Insights from Palakollu #sakshieducation
Published date : 04 Sep 2023 05:45PM