Skip to main content

Best Teacher Awards: ప్రైవేటు ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రైవేటు ఉపాధ్యాయులకూ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి హామీ ఇచ్చారు.
గురువులు సమాజానికి మూలస్తంభాలు,Announcing, Government Awards for Private Teachers
గురువులు సమాజానికి మూలస్తంభాలు

ఆదివారం నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అపుస్మా జిల్లా అధ్యక్షుడు గంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి కళ్లులాంటి వారన్నారు.

Also read: Jagananna Videshi Vidya Deevena: పేదింటి బిడ్డకు విదేశీ విద్య.. ‘అమెరికా వెళ్తుందని ఊహించలేదు’

ఉపాధ్యాయులు సమాజానికి మూల స్తంభాలని కొనియాడారు. వచ్చే ఏడాది అధికారికంగా ఉపాధ్యాయులకు అవార్డులు బహూకరిస్తామన్నా రు. చైల్డ్‌ కేర్‌ సెలవులు, రూ. 5 లక్షల రుణ సదుపాయానికి తోడ్పాటు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు అని కాకుండా విద్యార్థులందరూ బాగుండాలన్న ఉద్దేశ్యంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. డీసీఈబీ హాలు ఏర్పాటుకు సహకరించాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డికి విన్నవించారు.

Also read: డాక్టర్‌ అల్లూరి వెంకట నాగవర్మBest Teacher Awards: ఉత్తమ అధ్యాపకులఅవార్డులకు ఎంపిక

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి మాట్లాడుతూ విద్య అనగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ గుర్తుకు వస్తారన్నారు. ప్రతి పేద విద్యార్థికి రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రైవేటు ఉపాధ్యాయులపై సదభిప్రాయం ఉందన్నారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేవారు గురువులని, అలాంటి గురువులను సత్కరించినపుడే రాష్ట్రం, ప్రాంతం, జిల్లా బాగు పడుతుందన్నారు.

Also read: AP Third Place in Training & Employment to Rural Youth 

మేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ ఇటీవల గ్రూప్‌–1 ఫలితాల్లో ఎక్కువ మంది ప్రైవేటు విద్యా సంస్థలనుంచే ఎంపికయ్యారని గుర్తు చేశారు. జిల్లాలో 390–400 మంది కరస్పాండెంట్లు ఉన్నారని, తల్లిదండ్రుల కంటే పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయులతోనే గడుపుతున్నారన్నారు. అమ్మ ఒడి పథకం అమలులో ప్రైవేటు విద్యా సంస్థలకు కూడా వర్తింపజేశామన్నారు. డీఈఓ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులే కరస్పాండెంట్లుగా ఎదగడం స్వాగతిస్తున్నామన్నారు.

Also read: National Science Seminar – 2023: జాతీయ సైన్స్‌ సెమినార్‌ పోటీలకు ఆహ్వానం

ఉపాధ్యాయులు విద్యార్థులపై చెరగని ముద్ర వేయాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఉపాధ్యాయులేనన్నారు. అనంతరం ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో 100 మంది ఉపాధ్యాయులకు అతిథులు అవార్డుల ను ప్రదానం చేశారు.  

ప్రైవేట్‌ టీచర్లకూ అవార్డులు అందేలా కృషి చేస్తానని హామీ

 

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ.. #sakshieducation

Published date : 05 Sep 2023 10:12AM

Photo Stories