Dr. BR Ambedkar University: నూతనంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ (డిగ్రీ బీఎడ్) క్లాస్‌వర్క్
క్లాస్‌వర్క్ ఇంజినీరింగ్ బ్లాక్‌లో నిర్వహిస్తామని అన్నారు. విద్యార్థులకు వసతి గృహ సౌకర్యం సైతం కల్పిస్తామని అన్నారు. త్వరలో జాతీయ ఉపాధ్యాయ విద్యా ఉపాధ్యాయ మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనుందని చెప్పారు. ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కోర్సుకు సంబంధించి 15 పోస్టులు మంజూరు చేసిందని అన్నారు. ఇందులో ఒక ప్రొఫెసర్, రెండు అసోసియేట్ ప్రొఫెసర్, 12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయని అన్నారు. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుగుణంగా నియామకాలు ఉంటాయని చెప్పారు. నూతన విద్యా విధానంలో ఈ కోర్సును ఎస్‌సీటీఈ డిజైన్ చేసిందని చెప్పారు.
US Immigration: US ఇమ్మిగ్రేషన్ లో జరిగిన యదార్థ సంఘటన| అష్టకష్టాలు పడుతున్న విద్యార్థులు | US Visa
వర్సిటీలో బీఎస్సీ బీఎడ్‌లో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులు, బీఏ బీఎడ్‌లో హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులు ఉంటాయని అన్నారు. బీఎస్సీలో 50, బీఏలో 50 సీట్లతో కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లు చదివితే డిగ్రీ, నాలుగేళ్లు చదివితే డిగ్రీ బీఎడ్ డిగ్రీ వస్తుందని అన్నారు. ఇది విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పారు.
Einstein Visa: What is Einstein Visa | Mangesh Ghogre Gets USA Einstein Visa #sakshieducation