Exams Schedule: మార్చిలో అకడమిక్ పరీక్షలు..
సాక్షి ఎడ్యుకేషన్: పాఠశాల విద్య అకడమిక్ పరీక్షల క్యాలెండర్‌ను విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ విడుదల చేశారు. ఈ విషయాన్ని డీఈఓ మీనాక్షి ఆదివారం తెలిపారు. ఈ నెల 23 నుంచి 28 వరకూ 1 నుంచి 9 వ తరగతి వరకూ ఫార్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు, ఈ నెల 23 నుంచి మార్చి 1వరకూ 10వ తరగతి ప్రీ-ఫైనల్ రోజుకు రెండు చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు.
Government Orders To Officials-పేపర్ లీక్‌లు ఉండొద్దు,గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ..
1 నుంచి 5వ తరగతి వరకూ 23వ తేదీ తెలుగు, గణితం, 24న ఎన్విరానిమెంటల్ సైన్స్, ఇంగ్లిష్ పార్ట్–ఏ, పార్ట్–బి, 26న 3 నుంచి 5వ తరగతి వరకూ ఓఎస్‌ఎస్‌సీ పరీక్షలు ఉంటాయి. అలాగే 6 నుంచి 8 వ తరగతి వరకూ 23న తెలుగు, గణితం, 24న హిందీ, జనరల్ సైన్స్, 26న సోషల్, 27న ఇంగ్లీష్ పార్ట్–ఏ, ఇంగ్లీష్ పార్ట్–బీ, 28న ఓఎస్‌ఎస్‌సీ –1, 2 ఉంటాయి.
Korutla Woman Gets Three Government Jobs- మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
9వ తరగతికి 23న తెలుగు, గణితం, 24 హిందీ, జనరల్ సైన్స్, 26న సోషల్, 27న ఇంగ్లీష్ పార్ట్–ఏ, మధ్యాహ్నం పార్ట్–బీ ఉంటాయి. 23వ తేదీ 10వ తరగతి తెలుగు, 24న హిందీ, 26న ఇంగ్లీష్, 27న గణితం, 28న ఫిజికల్ సైన్స్, 29న బయాలజికల్ సైన్స్, మార్చి 1న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి.