Korutla Woman Gets Three Government Jobs- మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
![Korutla Woman Gets Three Government Jobs korutla mounica success story](/sites/default/files/images/2024/02/19/govt-job-1708318848.jpg)
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది.
వీఆర్‌వో ఉద్యోగం చేస్తూనే..
అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్‌వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది.ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్‌లో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది.
రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు
6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది.