Kendriya Sainik Board Scholarship: 5500 స్కాలర్‌షిప్‌లు... మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
కేంద్రీయ సైనిక్ బోర్డ్(కేఎస్‌బీ..) 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి ఉపకార వేతనాల పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మాజీ సైనిక ఉద్యోగుల వితంతువులు/సంరక్షకులు/మాజీ ఇండియన్ కోస్ట్‌గార్డ్ సిబ్బందికి చెందిన పిల్లలకు ప్రొఫెషనల్/టెక్నికల్ డిగ్రీ కోర్సులు కొనసాగించడానికి స్కాలర్‌షిప్‌లు అందిస్తారు.
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 5500(బాలురు– 2750, బాలికలు–2750)
స్కాలర్‌షిప్ మొత్తం: బాలురకు సంవత్సరానికి రూ.30,000, బాలికలకు సంవత్సరానికి రూ.36,000 చెల్లిస్తారు.
అర్హత: ప్రొఫెషనల్/టెక్నికల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హులు. ఇంటర్మీడియట్/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేటరల్ ఎంట్రీ, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదివే అభ్యర్థులు అర్హులు కాదు.
ఎంపిక విధానం: మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:31.12.2021
వెబ్‌సైట్: https://www.ksb.gov.in/
చదవండి: Vidyadhan Scholarship: ఇంటర్ రెండేళ్ల కాలానికి ఏడాదికి రూ.6000 చొప్పున అందజేత