Skip to main content

CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

cbse scholarship for single girl child 2022

కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ)..స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న, ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ (ఎస్‌జీసీఎస్‌) పేరుతో 2006 నుంచి ఈ పథాకాన్ని అమలు చేస్తోంది. పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికలు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల వారు నవంబర్‌ 14వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు

  • విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌) అయి ఉండాలి.
  • సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణులై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11వ తరగతిలో ప్రవేశం పొంది ఉండాలి.
  • పదోతరగతి పరీక్షల్లో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
  • విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.
  • 11,12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
  • సీబీఎస్‌ఈ బోర్డుకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిని అయితే ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్‌షిప్‌కు అర్హురాలే అవుతుంది.
  • విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌/ఎడీఎం/ ఎగ్జిక్యూటీవ్‌ మెజిస్ట్రేట్‌/నోటరీ అటెస్ట్‌ చేసిన ఒరిజినల్‌ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వ్యవధి

  • స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి ఏటా రెన్యూవల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 
  • స్కాలర్‌షిప్‌ రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతుల్లో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. 
  • విద్యార్థిని సత్ప్రవర్తనతోపాటు స్కూలు హాజరు శాతం కూడా బాగుండాలి.
  • ఒకవేళ విద్యార్థిని స్కూలు లేదా కోర్సు మారాలనుకుంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్‌షిప్‌ కొనసాగుతుంది. 
  • స్కాలర్‌షిప్‌ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు.

స్కాలర్‌షిప్‌ మొత్తం

విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున ఈ స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని అందిస్తారు. ఈ మొత్తం నేరుగా విద్యార్థినుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 14.11.2022
  • వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/

Scholarships in NMMS: ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రూ.12వేల స్కాలర్‌షిప్‌

Last Date

Photo Stories