Skip to main content

Scholarships in NMMS: ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. రూ.12వేల స్కాలర్‌షిప్‌

AP Directorate of Government Examinations Department

ప్రతిభ ఉండి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) కింద ఆర్థిక చేయూతనిస్తోంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించే ఉద్దేశంతో ఏటా ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. ప్రస్తుతం 2022 సంబంధించి ఎన్‌ఎంఎంఎస్‌ నోటిఫికేషన్‌ను  ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ విభాగం విడుదల చేసింది. 

రూ.12వేల స్కాలర్‌షిప్‌

ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.వెయ్యి చొప్పున ఏడాదికి రూ.12వేలను స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసే వరకూ.. ఈ ఉపకార వేతనం లభిస్తుంది.

అర్హతలు

ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో చదివే విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించి ఉండాలి. తుది ఎంపిక సమయం నాటికి 8వ తరగతిలో 55శాతం మార్కులు పొందాలి. కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.

ఎంపిక విధానం
ఎన్‌ఎంఎంఎస్‌ రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్స్‌కు ఎంపిక చేస్తారు.

చ‌ద‌వండి: Admissions in NIN Hyderabad: ఎన్‌ఐఎన్, హైదరాబాద్‌లో ప్రవేశాలు.. ఎవరు అర్హులంటే..

రాత పరీక్ష ఇలా
అర్హులైన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో పరీక్షను నిర్వహిస్తారు. ఈ పరీ„ý  ఆబ్జెక్టివ్‌ విధానంలో  రెండు పేపర్లుగా ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌(మ్యాట్‌), స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(సాట్‌).. ఇలా రెండు పేపర్లు కలిపి 180 ప్రశ్నలకు 180 మార్కులుంటాయి. పరీక్ష సమయం మూడు గంటలు. 

మ్యాట్‌
ఈ పేపర్‌లో మూడు విభాగాల నుంచి 90 ప్రశ్నలను అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ-45 ప్రశ్నలు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ-20 ప్రశ్నలు, హిందీ ప్రొఫిషియన్సీ నుంచి 25 చొప్పున ప్రశ్నలను ఇస్తారు.

సాట్‌
ఈ పేపర్‌లో కూడా మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 90 ప్రశ్నలుంటాయి. ఇందులో సైన్స్‌-35 ప్రశ్నలు, సోషల్‌ స్టడీస్‌-35, మ్యాథమెటిక్స్‌ విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలను అడుగుతారు.

దరఖాస్తు విధానం
ఆయా స్కూళ్లు రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలి. అనంతరం సంబంధిత ప్రింటవుట్లను,ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు పంపించాలి. 

పరీక్ష ఫీజు
ప్రతి విద్యార్థి పరీక్ష ఫీజు కింద రూ.100 ఎస్‌బీఐ చలానా రూపంలో సంబంధిత ధ్రువపత్రాలతో పాటు జతచేయాలి.

చ‌ద‌వండి: JNVST Class 9 Admissions: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • సంబం«ధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 31.10.2022. 
  • దరఖాస్తు ఫారాలు, ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరి తేదీ: 02.11.2022.
  • డీఈవో లాగిన్‌లో ఆమోదం పొందేందుకు చివరి తేదీ: 04.11.2022
  • వెబ్‌సైట్‌: https://bse.ap.gov.in
Last Date

Photo Stories