Skip to main content

సెస్, హైదరాబాద్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సీఈఎస్‌ఎస్‌), నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీతో కలిసి 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులకు కోరుతోంది.
మొత్తం సీట్ల సంఖ్య: 10
విభాగాలు: ఎకనమిక్స్, డెవలప్‌మెంట్‌ స్టాటిస్టిక్స్, కామర్స్‌/బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌(సెస్‌కి సంబంధించిన పరిశోధన విభాగాలు)

అర్హత: కనీసం 55శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ఎంఫిల్‌ ఉత్తీర్ణతతోపాటు యూజీసీ నెట్, స్లెట్‌ల్లో అర్హత సాధించాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ పద్ధతిలో ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వూ్యకి పిలుస్తారు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ఈ పరీక్ష ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డీన్, డివిజన్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్, సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్, బేగంపేట్, హైదరాబాద్‌–500016 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

పరీక్ష తేది: 07.08.2021

ఇంటర్వూ్య తేది: 21.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://cess.ac.in

Photo Stories