Admissions in NISER: ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..

భువనేశ్వర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైసర్)కి చెందిన స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ–పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఫిజికల్ సైన్సెస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/ఫిజిక్స్ మెయిన్ సబ్జెక్టుగా తత్సమాన డిగ్రీ/ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. బ్యాచిలర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: జామ్ 2022/జస్ట్ 2022లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2022
పరీక్ష/ఇంటర్వ్యూ తేది: 2022 జూన్ 02, 03
వెబ్‌సైట్: https://www.niser.ac.in/