NIMS Hyderabad: నిమ్స్, హైదరాబాద్‌లో ఎమ్మెస్సీ కోర్సులకు ప్రవేశాలు
హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్).. 2021 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎమ్మెస్సీ(జెనెటిక్ కౌన్సెలింగ్) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: ఎమ్మెస్సీ(జెనెటిక్ కౌన్సెలింగ్).
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
అర్హత: బీఎస్సీ(లైఫ్ సైన్స్) ఉత్తీర్ణులవ్వాలి. నర్సింగ్ డిగ్రీ/హ్యూమన్ జెనెటిక్స్/హ్యూమన్ బయాలజీ/మాలిక్యూలర్ బయాలజీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు: 31.12.2021 నాటికి 45ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది అసోసియేట్ డీన్, అకడమిక్–2, సెకండ్ ఫ్లోర్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్–500082 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 04.10.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 07.10.2021
వెబ్‌సైట్: https://nims.edu.in/