Skip to main content

Admission in Dr NTR University: బీఎస్సీ, బీపీటీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఇదే..

Dr NTR University

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయవాడలోని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌.. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు
నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, నాలుగున్నరేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(బీపీటీ), బీఎస్సీ పారామెడికల్‌ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రిక్‌ టెక్నాలజీ(ఆప్టోమెట్రీ), బీఎస్సీ రీనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, బీఎస్సీ పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్‌ కేర్‌ టెక్నాలజీకార్డియో వాస్కులర్‌ టెక్నాలజీ, బీఎస్సీ అనెస్తీషియాలజీ టెక్నాలజీఆపరేషన్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఇమేజింగ్‌ టెక్నాలజీ, బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నాలజీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ.
అర్హత: ఇంటర్మీడియట్‌/10+2 సైన్స్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ), ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ బ్రిడ్జ్‌ కోర్సు(బయోలాజికల్, ఫిజికల్‌ సైన్సెస్‌) ఉత్తీర్ణులవ్వాలి. జనరల్‌ అభ్యర్థులు సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు  40శాతం మార్కులు సాధించాలి.
వయసు: 31.12.2022 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 02.09.2022

వెబ్‌సైట్‌: https://ntruhs.ap.nic.in

Last Date

Photo Stories