5th Class Admission : ఎంజే పీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఈలో ఐదో తరగతి ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కానూరు(విజయవాడ)లోని మహాత్మాజ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూఆర్‌ఈ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 99 గురుకుల పాఠశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతి (ఇంగ్లిష్ మీడియం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2020–21లో మూడో తరగతి, 2021–22లో నాలుగో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. 2020–21 సంవత్సరానికి గాను తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి.
వయసు: ఇతరులు 01.09.2011 నుంచి 31.08.2013 మధ్య ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2009 నుంచి 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా .
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.04.2022
వెబ్‌సైట్: http://apgpcet.apcfss.in