NTA-GPAT 2022: ఎంఫార్మా/తత్సమాన కోర్సుల్లో ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. గ్రాడ్యుయేట్ ఫార్మసీ అప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్) 2022 ప్రకటనను విడుదల చేసింది. దీనిద్వారా ఎంఫార్మా/తత్సమాన కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఇంటర్మీడియట్ తర్వాత ఫార్మసీలో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు మొదలయ్యేనాటికి బీఫార్మసీ పరీక్షా ఫలితాలు వెలువడిన చివరి సంవత్సరం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీటెక్(ఫార్మాస్యూటికల్,ఫైన్ కెమికల్ టెక్నాలజీ)/తత్సమాన అభ్యర్థులు దీనికి అర్హులు కాదు. జీప్యాట్–2022 దరఖాస్తుకు వయసుతో సంబంధం లేదు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్,పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: 2022–23 విద్యా సంవత్సరానికి మాస్టర్స్(ఎంఫార్మా) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షలో వివిధ విభాగాలు ఉంటాయి. ఇందులో 125 ప్రశ్నలుంటాయి. ఒక్కోదానికి 4 మార్కులు చొప్పున 500 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.03.2022
వెబ్‌సైట్: https://gpat.nta.nic.in/
చదవండి: NTA-CMAT-2022: మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరితేది ఇదే..