Skip to main content

Microsoft: ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

Applications Invited for Microsoft Future Ready Talent program
  • వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు కోరుతున్న మైక్రోసాఫ్ట్‌
  • డిగ్రీ స్థాయి విద్యార్థులకు చక్కటి అవకాశం

యువతలో నైపుణ్యాలకు మెరుగులు దిద్దేందుకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా ఇంటర్న్‌షిప్‌ శిక్షణ ఇస్తోంది. డిగ్రీ స్థాయి కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం ‘ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌’ పేరుతో ప్రత్యేక వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్‌ 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్లు 50 వేల మందికి చేరినా లేదా సెప్టెంబర్‌ 26న గాని ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుందని మైక్రోసాఫ్ట్‌ ఇండియా పేర్కొంది. 

పలు సంస్థల సహకారం

  • మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, నాస్కామ్, ఫ్యూచర్‌ స్కిల్స్‌ ప్రైమ్, గిట్‌ హబ్, ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై), క్యూస్‌ కార్ప్‌ వంటి సంస్థల భాగస్వామ్యంతో మైక్రోసాఫ్ట్‌ ఈ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
  • విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్, సర్టిఫికేషన్‌ అందిస్తుంది. లెర్నింగ్‌ మాడ్యూల్స్‌లో క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి ట్రెండింగ్‌ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తుంది. 
  • అవసరమైన టెక్నికల్‌ సర్వీస్‌ను ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై)చూసుకోవడంతో పాటు,విద్యార్థులకు మెంటార్‌షిప్‌ను కూడా అందిస్తుంది. 
  • గిట్‌ హబ్‌ ఉచితంగా గిట్‌హబ్‌ స్టూడెంట్‌ ప్యాక్‌ యాక్సెస్‌ను అందిస్తుంది.
  • క్యూస్‌ కార్ప్‌ విద్యార్థులకు వర్చువల్‌ ఫెయిర్స్‌ ద్వారా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. 
  • సంబంధిత కోర్సులు నేషనల్‌ ఆక్యుపేషనల్‌ స్టాండర్డ్స్‌తో సమానంగా ఉన్నాయనే విషయాన్ని నాస్కామ్‌ ధృవీకరిస్తుంది.

 
ఎవరు అర్హులు
ఈ ప్రోగ్రామ్‌కు 2022, 2023లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేవారు, 2021లో గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని విభాగాల డిగ్రీ స్థాయి విద్యార్థులు అర్హులే. ఇంటర్న్‌షిప్‌ దాదాపు తొమ్మిది వారాల పాటు కొనసాగుతుంది. 

ప్రయోజనాలు
‘ఫ్యూచర్‌ రెడీ టాలెంట్‌’ వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లో చేరే విద్యార్థులకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా కోర్సులో అన్ని స్థాయిలను విజయవంతంగా పూర్తిచేసినవారికి ఇంటర్న్‌షిప్‌ సర్టిఫికెట్‌ లభిస్తుంది. ఇక్కడ పొందిన శిక్షణ విద్యార్థులు కెరీర్‌లో ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ విధానంలో నైపుణ్యాలను నేర్చుకునేలా కోర్సు కరిక్యులం రూపొందించారు. ఇది ఇండస్ట్రియల్‌ బేస్డ్‌ ట్రైనింగ్‌ కావడంతో విద్యార్థులు భవిష్యత్‌ లో ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు ఈ సర్టిఫికెట్‌ను, స్కిల్స్‌ను తమ ప్రొఫైల్‌లో రిక్రూటర్లకు చూపించవచ్చు. అదేవిధంగా ఈ శిక్షణకు ఎంపికైనవారు గిట్‌ హబ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా గ్లోబల్‌ డెవలపర్స్‌ సహకారాన్ని పొందుతారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 26.09.2021

వివరాలు, రిజిస్ట్రేషన్‌ కోసం వెబ్‌సైట్‌: https://www.futurereadytalent.in

Last Date

Photo Stories