Skip to main content

Pilot Training Eligibility : విద్యార్హ‌త‌ల్లో మార్పులు.. పైల‌ట్ శిక్ష‌ణకు అంద‌రూ అర్హులేనా..!!

వాణిజ్య పైల‌ట్ లైసెన్స్ శిక్ష‌ణ పొందాలనుకునే అభ్య‌ర్థులు త‌మ‌ ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ విద్య‌ను త‌ప్ప‌నిస‌రిగా పొందిల్సి ఉంది. ఈ రూల్ గత కొన్ని సంవ‌త్స‌రాల నుంచి న‌డుస్తోంది..
Education eligibility for pilot training    Commercial pilot license training for non-science students

సాక్షి ఎడ్యుకేష‌న్‌: వాణిజ్య పైల‌ట్ లైసెన్స్ శిక్ష‌ణ పొందాలనుకునే అభ్య‌ర్థులు త‌మ‌ ఇంట‌ర్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్ విద్య‌ను త‌ప్ప‌నిస‌రిగా పొంది ఉండాల‌ని ఇప్ప‌టికే ఉన్న ఈ రూల్‌ను తొల‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది డీజీసీఏ. ఇలా, ఒకే కోర్సు పూర్తి చేసిన వారికే శిక్ష‌ణ అందించ‌డం కాకుండా, దీనితోపాటు.. ఆర్ట్స్‌, కామ‌ర్స్ వంటి వివిధ‌ కోర్సుల్లో ఇంట‌ర్‌ విద్య‌ల‌ను పూర్తి చేసిన వారికి కూడా అవ‌కాశం క‌ల్పిస్తూ వారికి కూడా ఈ శిక్ష‌ణ‌లో అర్హ‌త పొందుప‌ర్చాల‌న్నారు. ఈ మెర‌కు మ్యాథ్స్‌, సైన్స్ విద్యార్థుల‌కు మాత్ర‌మే కాకుండా ఇత‌ర కోర్సు చేసిన విద్యార్థులకు కూడా వాణిజ్య పైల‌ట్ లైసెన్స్ శిక్ష‌ణ అందించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

బ్రేకింగ్ న్యూస్‌:నేడే జేఈఈ మెయిన్ 2025 సెషన్‌ 2 ఫలితాలు విడుదల?

ఇదిలా ఉంటే.. 1990 నుంచి ఇండియాలో ఈ రంగం సైన్స్‌&మ్యాథ్స్ వంటి కోర్సులో విద్య పొందిన‌ విద్యార్థుల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఉంది. మ‌రి, ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి న‌డుస్తున్న ఈ విధానాన్ని మారుస్తారా.. లేదా అనే విష‌యంపై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది. ఒక‌వేళ‌, ఇదేకాని జ‌రిగితే ఎలాంటి విద్యార్హ‌త ఉన్న కూడా అభ్య‌ర్థికి ఫిట్‌నెస్ ఉంటే చాలు వారంతా ఈ పైలట్ శిక్ష‌ణ‌కు అర్హ‌త పొందిన‌ట్టే. ఇక‌, చూడాలి త్వ‌ర‌లో ఈ విష‌యంపై ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తారో..

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 18 Apr 2025 11:16AM

Photo Stories