Skip to main content

ఉస్మానియా యూనివర్సిటీ – సీపీజెట్‌ 2021.. దరఖాస్తు వివరాలు ఇలా..

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ).. 2021–22 విద్యా సంవత్సరానికి గాను కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హత: ఇంటర్‌/డిగ్రీ ఉత్తీర్ణులైన/చివరి ఏడాది పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంసీజే, మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ.
పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ.

యూనివర్శిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 30.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021

పరీక్ష తేదీలు: 08.09.2021 నుంచి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.osmania.ac.in  or www.cpget.tsche.ac.in  or
www.tscpget.com  or www.ouadmissions.com

Photo Stories