Skip to main content

నిఫ్ట్‌లో ఆర్టిజన్స్‌/చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్టిజన్స్‌ ప్రవేశాలు

భారత ప్రభుత్వ టెక్స్‌టైల్‌ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంగణాల్లో 2021 సంవత్సరానికి గాను బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌–ఆర్టిజన్స్‌/చిల్డ్రన్‌ ఆఫ్‌ ఆర్టిజన్స్‌ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
విభాగాలు: ఫ్యాషన్‌ డిజైన్‌/లెథర్‌ డిజైన్‌/యాక్సెసరీ డిజైన్‌/టెక్స్‌టైల్‌ డిజైన్‌/ నిట్‌వేర్‌ డిజైన్‌/ ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌.
అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/మూడు లేదా నాలుగేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 24ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: స్టూడియో టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. స్టూడియో టెస్ట్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి అభ్యర్థుల నాలెడ్జ్, స్కిల్‌ ఆప్టిట్యూడ్‌ తెలుసుకోవడానికి నిర్వహిస్తారు. స్టూడియో టెస్ట్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా తయారు చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: మార్చి 21, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.nift.ac.in

Photo Stories