Skip to main content

ఎన్‌ఎస్‌ఐ, కాన్పూర్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు చివరి తేది జూన్‌ 4..

భారత ప్రభుత్వ వినియోగదా రుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన కాన్పూర్‌లోని నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌ఐ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబం« ధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

  • పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ(66 సీట్లు).
  • పీజీ డిప్లొమా కోర్సు–అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌(33 సీట్లు).
  • పీజీ డిప్లొమా కోర్సు–ఇండస్ట్రియల్‌ ఫర్మంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ(39 సీట్లు).
  • పీజీ డిప్లొమా కోర్సు–షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మెచ్యూరిటీ మేనేజ్‌మెంట్‌(20 సీట్లు).
  • పీజీ డిప్లొమా కోర్సు–ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌ (17 సీట్లు).
  • పీజీ డిప్లొమా కోర్సు–క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఇన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌(22 సీట్లు);షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు(63 సీట్లు); షుగర్‌ ఇంజనీరింగ్‌ సర్టిఫికేట్‌ కోర్సు(17 సీట్లు); సర్టిఫికేట్‌ కోర్సు ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌(22 సీట్లు); ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ/షుగర్‌ కెమిస్ట్రీ;ఎ ఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ షుగర్‌ ఇంజనీరింగ్‌;ఎఫ్‌ఎన్‌ఎస్‌ఐ ఇన్‌ ఫర్మంటేషన్‌ టెక్నాలజీ.
అర్హత: ప్రోగ్రామ్‌ను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అడ్మిషన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టర్, నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్, కళ్యాణపూర్, కాన్పూర్‌–208017 చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 19.04.2021
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 04.06.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 11.06.2021
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌ చేసుకొనే తేది: 21.06.2021
పరీక్ష తేది: 27.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://nsi.gov.in

Photo Stories