Skip to main content

CIPET-CSTS Hyderabad: సీపెట్‌–సీఎస్‌టీఎస్, హైదరాబాద్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది ఇదే..

CIPET-CSTS Hyderabad

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌).. సెంటర్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ (సీఎస్‌టీఎస్‌).. అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి మెషిన్‌ ఆపరేటర్‌(టూల్‌ రూం) ప్రోగ్రామ్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల సంఖ్య: 30
అర్హత: ఎనిమిదో తరగతి/ఆపైన ఉత్తీర్ణులైన ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సీపెట్‌ సర్టిఫికేట్‌తోపాటు ప్లాస్టిక్స్, అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సదుపాయం ఉంటుంది.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: cipethydstc@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://www.cipet.gov.in/

Last Date

Photo Stories