Skip to main content

SILVER CET-2023: సిల్వర్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా..

కర్నూలులోని సిల్వర్‌ జూబ్లీ ప్రభుత్వ కళాశాల(కోఎడ్యుకేషన్, అటానమస్‌) 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి సిల్వర్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిగ్రీ కోర్సు(ఇంగ్లిష్‌ మీడియం)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత బోధన, భోజన, వసతి, శిక్షణ అందుతుంది.
SILVER CET - 2023 Notification

అర్హత: మార్చి-2023లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.

చ‌ద‌వండి: APRDC CET 2023 Notification: ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదల..

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.05.2023.
హాల్‌ టికెట్‌/అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: 18.05.2023.
కంప్యూటర్‌ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: 25.05.2023.

వెబ్‌సైట్‌: https://www.sjgckurnool.edu.in/

చ‌ద‌వండి: AP ICET 2023 Notification: ఏపీ ఐసెట్‌-2023 నోటిఫికేషన్‌ వివరాలు.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

Last Date

Photo Stories