NEET-UG 2022: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు.. పరీక్షా విధానం ఇలా..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)..నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2022 నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. దీని ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 17–25 ఏళ్ల మధ్య ఉండాలి. 31.12.2004 తర్వాత జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. నీట్(యూజీ) 2022 పరీక్షలో నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు (సెక్షన్ ఏ, సెక్షన్ బి) ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలకు గాను 3 గంటల 20 నిమిషాలు పరీక్షా సమయం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 07.05.2022
పరీక్ష తేది: 17.07.2022 (మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20 వరకు)
వెబ్‌సైట్: www.nta.ac.in, https://neet.nta.nic.in
చదవండి: NEET 2022: ఈ నెలాఖరులోపు నోటిఫికేషన్.. మార్పులు, చేర్పులు ఇవే.. సన్నద్ధత ఇలా..