Diploma Courses: నైపెడ్, సికింద్రాబాద్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్(మనోవికాస్ నగర్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజెబిలిటీస్(దివ్యాంగ్‌జన్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
నైపెడ్, సికింద్రాబాద్: డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఒకేషనల్ రిహెబిలిటేషన్.
నైపెడ్, కోల్‌కతా: డిప్లొమా ఇన్ ఒకేషనల్ రిహేబిలిటేషన్.
నైపెడ్, నవీ ముంబై: డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఒకేషనల్ రిహేబిలిటేషన్.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సంబంధిత నైపెడ్ రీజియన్ సెంటర్లకి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.09.2021
వెబ్‌సైట్: https://niepid.nic.in/