Skip to main content

NEET UG 2024 Counselling Postponed: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా.. షెడ్యూల్‌ మళ్లీ ఎప్పుడంటే..

Counseling Postponed Pending Supreme Court Verdict  Delhi NEET-UG Counseling Update  NEET UG 2024 Counselling Postponed  NEET-UG Counseling Postponed Announcement  Medical Board Decision on NEET-UG Counseling  Supreme Court Arguments on NEET Exams

ఢిల్లీ: ఢిల్లీ: నీట్‌-యూజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడింది. నేటి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌‌ను వాయిదా వేస్తూ మెడికల్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎల్లుండి సుప్రీంకోర్టులో నీట్‌ పరీక్షలపై వాదనలు జరగనున్నాయి.
 

Degree Admissions 2024: ఈ నెలాఖరు నుంచే డిగ్రీ క్లాసులు ప్రారంభం.. గతంతో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు

తీర్పు అనంతరం కౌన్సిలింగ్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది మే 5న నీట్‌-యూజీ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.నీట్‌ పీజీ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో దాదాపు 67 మందికి ఫస్ట్‌ ర్యాంకు రావడం, వారందరికి 720 మార్కులు రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

NEET UG counselling 2024: నీట్‌–యూజీ కౌన్సెలింగ్‌పై అయోమయం!.. ఇంతవరకు షెడ్యూల్‌ విడుదల చేయని ఎంసీసీ

అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం సహా పలు కారణాలతో నీట్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై మరో రెండు రోజుల్లో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో నీట్‌ పరీక్షను రద్దు చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

Published date : 06 Jul 2024 01:39PM

Photo Stories