NEET UG 2023: రేపే నీట్ ఎగ్జామ్... ఇలా వెళితేనే పరీక్ష కేంద్రంలోకి అనుమతి
![NEET UG 2023 Sunday](/sites/default/files/images/2023/05/06/students-1683373137.jpg)
గంట ముందుగా చేరుకుంటే...
పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా చేరుకుంటే మంచింది. పరీక్ష కేంద్రాన్ని చెక్ చేసుకోవాలి. కొన్ని నగరాల్లో ఒకటే పేరు మీరు పీజీ, యూజీ కాలేజీలు ఉంటాయి. కాబట్టి పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకుంటే మంచింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 1.15 గంటల వరకు విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ఆధారంగా.. ఏ గదిలో మీ సీట్ ఎలాట్ చశారో చూసుకోవాలి. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాల్‌లోకి ఎవరినీ అనుమతించరు. 1.45 గంటలకు ప్రశ్నపత్రం బుక్‌లెట్ ఇస్తారు. మధ్యాహ్నం 1.50 నుంచి 2 గంటల వరకు అభ్యర్థులు తమకు అవసరమైన వివరాలను బుక్‌లెట్‌లో నింపాల్సి ఉంటుంది. 2 గంటలకు పేపర్ ఇస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీలో మళ్లీ పరీక్షలు వాయిదా.. కొత్తగా ప్రకటించిన తేదీలు ఇవే
► పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్ షీట్‌పై అతికించాలి.
► అభ్యర్థులు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోనికి అనుమతించరు.
► స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ మాత్రమే వేసుకోవాలి.
► పేపర్లు, జామెట్రీ/పెన్సిల్ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్‌డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుతించరు.
చదవండి: రాహుల్ గాంధీకి శిక్ష విధించిన జడ్జీకి ప్రమోషన్
► చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించకూడదు.
► మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్‌ఫోన్లు, పేజర్స్, హెల్త్ బ్యాండ్స్, స్మార్ట్ వాచ్‌లు వంటి కమ్యూనికేషన్ డివైజ్‌లను లోనికి అనుమతించరు. ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్లకూడదు.
► అభ్యర్థులు పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.