Skip to main content

Big Breaking: టీఎస్‌పీఎస్సీలో వాయిదాల ప‌ర్వం... మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌రీక్ష‌లు వాయిదా.. కొత్త‌గా ప్ర‌క‌టించిన తేదీలు ఇవే

టీఎస్‌పీఎస్సీలో ఏం జ‌రుగుతుందో ఏం అర్థం కావ‌డం లేదు. నిరుద్యోగ అభ్య‌ర్థుల‌తో బోర్డు ఆట‌లాడుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే బోర్డు అధికారుల అంతులేని నిర్ల‌క్ష్యం కార‌ణంగా ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా ప‌డ్డాయి.
TSPSC
TSPSC

ఆ త‌ర్వాత సిట్‌, ఈడీ కేసులంటూ కాల‌యాప‌న చేసిన బోర్డు.. వాయిదా వేసిన ప‌రీక్ష‌ల తేదీల‌ను మ‌ళ్లీ కొత్త‌గా ప్ర‌క‌టించింది. అయితే తాజాగా మ‌ళ్లీ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.... 

పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ ప‌రీక్ష వాయిదా...
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ పోస్టుల‌కు సంబంధించి టీఎస్‌పీఎస్సీ మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఏ కార‌ణాలు చెప్ప‌కుండా మ‌ళ్లీ ప‌రీక్ష‌ను బోర్డు వాయిదా వేసింది. పరీక్ష‌ను సెప్టెంబర్ కి వాయిదా వేసింది. సెప్టెంబ‌ర్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామ‌ని వెల్ల‌డించింది. 

ఫిజికల్ డైరెక్టర్ ప‌రీక్ష వాయిదా....
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు టెక్నికల్ అండ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయి. మే 17న వీటికి సంబంధించి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా.. తాజాగా దీనిని వాయిదా వేశారు. తాజాగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన వెబ్ నోట్ లో దీనిని సెప్టెంబర్ 11కు రీషెడ్యూల్ చేసినట్లు పేర్కొన్నారు.

అలాగే మే నెల నిర్వ‌హించ‌నున్న ప‌రీక్ష‌ల తేదీలు ఇలా ఉన్నాయి... 
మే 16           - అగ్రికల్చర్ ఆఫీసర్ 
మే 17           - లైబ్రైరియన్ పోస్టులు    
మే 8,9, 21    - అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్(ఏఈఈ)    
మే 19           - డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులు

Published date : 06 May 2023 02:01PM

Photo Stories