APPSC Recruitment 2021: ఏపీలో తెలుగు రిపోర్టర్ పోస్టులు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)... ఏపీ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్ట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: తెలుగు రిపోర్టర్లు
మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్‌బీటీఈటీ హైదరాబాద్ నిర్వహించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్(తెలుగు)లో హయ్యర్ గ్రేడ్ అర్హతతోపాటు నిమిషానికి 80 పదాల వేగంతో తెలుగు షార్ట్ హ్యాండ్ టైపింగ్ చేయాలి.
వయసు: 01.07.2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ /ఈడబ్ల్యూఎస్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 150 ప్రశ్నలు–150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో 150 మార్కులకు తెలుగులో షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్, లాంగ్‌హ్యాండ్‌లో ట్రాన్స్‌స్క్రిప్షన్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.10.2021
దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021
వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: APPSC Recruitment 2021: ఏపీలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Qualification | GRADUATE |
Last Date | November 08,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |