Skip to main content

Andhra Pradesh Jobs: ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, శ్రీకాకుళంలో 85 మెడికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

GGH Srikakulam

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌... శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో(జీజీహెచ్‌) ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 85
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ఆపరేషన్‌ అసిస్టెంట్, డేటాఎంట్రీ ఆపరేటర్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి.ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తును సూపరింటెండెంట్, గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://srikakulam.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Govt Jobs: ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, కడపలో 112 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date December 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories