Skip to main content

Andhra Pradesh Jobs: ఆర్‌సీడీ హాస్పిటల్, విశాఖపట్నంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

RCD Hospital Visakhapatnam

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నంలోని ఆర్‌సీడీ ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పారామెడికల్, ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్లు, ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ, రేడియోగ్రాఫర్, జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్‌ఎం, డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ, డిఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత సర్టిఫికేట్‌ కోర్సుతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 01.12.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ది సూపరింటెండెంట్, ఆర్‌సీడీ హాస్పిటల్, పెద్దవాల్తేరు, విశాఖపట్నం–530017, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 15.12.2021

వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in

చ‌ద‌వండి: Andhra Pradesh Jobs: ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో 138 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification 10TH
Last Date December 15,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories