ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, తెలంగాణ రీజియన్‌లో 72 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ).. తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం(హైదరాబాద్).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
పోస్టుల వివరాలు: అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ)–25, స్టెనోగ్రాఫర్–04, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–43.
అర్హత: ఎంటీఎస్ పోస్టులకు పదో తరగతి/తత్సమాన, స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: యూడీసీ, స్టెనో పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: యూడీసీ, స్టెనో పోస్టులకు పే లెవల్–4 ప్రకారం రూ.25,500 నుంచి రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు పే లెవల్–1 ప్రకారం 18,800 నుంచి రూ.56,900 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం:
అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ): ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది.
స్టెనోగ్రాఫర్: దీనికి మెయిన్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ మాత్రమే ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ ఎగ్జామ్‌లో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో డిక్టేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్ (ఇంగ్లిష్, హిందీ) టెస్టులు ఉంటాయి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): ప్రిలిమినరీ పరీక్ష 200 మార్కులకు, మెయిన్స్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది:15.01.2022
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:15.02.2022
వెబ్‌సైట్: https://www.esic.nic.in/
చదవండి: ESIC Recruitment: ఈఎస్‌ఐసీ, ఏపీ రీజియన్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | February 15,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |