Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, కృష్ణాలో అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్యవిధాన పరిషత్(ఏపీవీవీపీ).. కృష్ణా జిల్లా ఆసుపత్రిలో ఒప్పంద/అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్2–10, ల్యాబ్ టెక్నీషియన్–09, రేడియోగ్రాఫర్–02, థియేటర్ అసిస్టెంట్–03, ల్యాబ్ అటెండెంట్–02, జూనియర్ అసిస్టెంట్–12, ఆఫీస్ సబార్డినేట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, డిగ్రీ/డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, డిస్ట్రిక్ హాస్పిటల్ క్యాంపస్, కృష్ణా, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
చదవండి: Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, అనంతపురంలో పదోతరగతి, ఇంటర్ అర్హతతో 76 పోస్టులు
Qualification | 10TH |
Last Date | November 29,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |