Andhra Pradesh Govt Jobs: జీజీహెచ్, కడపలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ కార్యాలయం.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్,ఫిజిసిస్ట్, ఎఫ్‌ఎన్‌ఓ,ఈసీజీ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటాఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, ఓటీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యు యేషన్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత టెక్నికల్ సర్టిఫికేట్లు, పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.37,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ వైద్య కళాశాల సూపరింటెండెంట్ కార్యాలయం, కడప, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 25.05.2022
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 25,2022 |
Experience | 1 year |
For more details, | Click here |