Skip to main content

DMHO Recruitment: డీఎంహెచ్‌వో, నెల్లూరులో మెడికల్‌ పోస్టులు.. నెలకు రూ.70 వేల వ‌ర‌కు వేతనం..

DMHO Nellore Recruitment

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: జిల్లా ఎపిడిమియాలజిస్ట్‌–01, ఓటీ టెక్నీషియన్లు–09, డెంటల్‌ హైజినీస్ట్‌–ఎన్‌ఓహెచ్‌పీ–02.

జిల్లా ఎపిడిమియాలజిస్ట్‌: 
అర్హత: ఎంబీబీఎస్‌/ఎండీ/డీఎన్‌(పబ్లిక్‌ హెల్త్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
జీతం: నెలకి రూ.70,000 చెల్లిస్తారు.

ఓటీ టెక్నీషియన్లు: 
అర్హత: ఇంటర్మీడియట్, డిప్లొమా(ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నీషియన్‌ కోర్సు) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
జీతం: నెలకి రూ.12,000 చెల్లిస్తారు.

డెంటల్‌ హైజినిస్ట్‌–ఎన్‌ఓహెచ్‌పీ: 
అర్హత: ఇంటర్మీడియట్,సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.స్టేట్‌ డెంటల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. 
జీతం: నెలకి రూ.15,750 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022 జనవరి 20 నుంచి 27 వరకు 
వేదిక: డీఎంహెచ్‌వో, నెల్లూరు, ఏపీ.

వెబ్‌సైట్‌: http://spsnellor.ap.gov.in/

Qualification 12TH
Last Date January 27,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories