Skip to main content

APVVP Recruitment: ఏపీ, కడప జిల్లాలో మెడికల్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

AP Medical Policy Council‌ Kadapa

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. కడప జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్‌–01, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, రేడియోగ్రాఫర్‌–01, థియేటర్‌ అసిస్టెంట్‌లు–07, ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు–02, డెంటల్‌ టెక్నీషియన్లు–01, ఆడియో మెట్రీషియన్‌–02, జూనియర్‌ అసిస్టెంట్‌–01, ఆఫీస్‌ సబార్డినేట్‌–02, ఎలక్ట్రీషియన్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత కోర్సుల్లో డిప్లొమా, డీఫార్మసీ/బీఫార్మసీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవంతోపాటు సంబంధిత బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ. 12,000 నుంచి రూ.28,000వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజ్, కోర్సు వెయిటేజ్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్, ఏవీవీవీపీ, న్యూకలెక్టరేట్, కడప చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.01.2022

వెబ్‌సైట్‌: https://kadapa.ap.gov.in/

Qualification 12TH
Last Date January 31,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories