IARI Recruitment 2021: ఐఏఆర్‌ఐ, న్యూఢిల్లీలో 38 ఖాళీలు
న్యూఢిల్లీలోని ఐకార్–ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐఏఆర్‌ఐ)కు చెందిన ఇన్విరాన్‌మెంటల్ సైన్స్ విభాగం.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 38
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్–02, సీనియర్ రీసెర్చ్ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్)–03, యంగ్ ప్రొఫెషనల్స్–16, ల్యాబ్ కమ్ ఫీల్డ్ వర్కర్–17.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, బీఎస్సీ(అగ్రికల్చర్), ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.47,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
వెబ్‌సైట్: https://www.iari.res.in/
Qualification | 10TH |
Last Date | September 24,2021 |
Experience | 1 year |
For more details, | Click here |