THDC Recruitment 2023: మినీరత్న కంపెనీలో.. జూనియర్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
Sakshi Education
ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్‌లోని మినీరత్న సంస్థ.. తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(టీహెచ్‌డీసీఎల్).. మొత్తం 181 జూనియర్ ఇంజనీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. టీహెచ్‌డీసీఎల్‌లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల పూర్తి వివరాలు..
- మొత్తం పోస్టుల సంఖ్య: 181
- పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ ట్రెయినీ(సివిల్)-72, జూనియర్ ఇంజనీర్ ట్రెయినీ(ఎలక్ట్రికల్)-72, జూనియర్ ఇంజనీర్ ట్రెయినీ(మెకానికల్) విభాగాల్లో 37 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు
- ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్ డిప్లొమా/లేటరల్ ఎంట్రీ డిప్లొమా/బీఎస్సీ/బీఈ/బీటెక్ 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగలు, ఎక్స్-సర్వీస్‌మెన్/ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు డిప్లొమా ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
- వయసు: 07.06.2023 నాటికి 27 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం
- ఆన్‌లైన్(సీబీటీ-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో 200 ప్రశ్నలు- 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పార్ట్-1లో సివిల్/ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన 140 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. పార్ట్-2లో జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి-30 ప్రశ్నలు, పార్ట్-3లో రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలను అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. అలాగే ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష రాసుకోవచ్చు.
- రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ-వేతనాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలోనే మూలవేతనం, డీఏ తదితర ప్రోత్సాహకాలూ లభిస్తాయి. లీవ్, వైద్య సదుపాయం, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాట్యుటీ మొదలైనవి ఉంటాయి. ఉద్యోగం రెగ్యులర్ అయిన తర్వాత కంపెనీ క్వార్టర్స్/హెచ్‌ఆర్‌ఏ వంటివి పొందొచ్చు. పే స్కేల్.. రూ.29,200 - రూ.1,19,000.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2023
- వెబ్‌సైట్: https://www.thdc.co.in/
చదవండి: BDL Recruitment 2023: బీడీఎల్, హైదరాబాద్‌లో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |