Skip to main content

Power Grid Recruitment 2022: 800 ఫీల్డ్‌ ఇంజనీర్‌ & సూపర్‌వైజర్‌ పోస్టులు.. కటాఫ్‌ ఎంత అంటే?

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'మహారత్న'.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా 800 ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.
Power Grid Recruitment 2022 For Field Engineer & Supervisor Jobs

ఒప్పంద ప్రాతిపదికన భర్తీచేసే ఈ ఉద్యోగాలకు డిప్లొమా/ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించాలి.

విభాగాల వారీగా పోస్టులు

  • ఫీల్డ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌): 50 పోస్టులు
  • ఫీల్డ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 15 పోస్టులు
  • ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఐటీ): 15 పోస్టులు
  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌): 480 పోస్టులు
  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌): 240 పోస్టులు

అర్హతలు

  • ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) పోస్టులకు ఎలక్ట్రికల్‌ విభాగంలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌/ఓబీసీ(ఎన్‌సీఎల్‌)/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 55శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ /ఎస్టీ/దివ్యాంగులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. –డిజైన్‌/ఇంజనీరింగ్‌/కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ఓఅండ్‌ఎం ఇన్‌ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌(ఆర్‌ఈ)/డిస్ట్రిబ్యూషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(డీఎంఎస్‌), సబ్‌ట్రాన్స్‌మిషన్‌(ఎస్‌టీ/ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌(టీఎల్‌ఎస్‌/సబ్‌స్టేషన్స్‌(ఎస్‌/ఎస్‌)లో ఏడాది పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

చ‌ద‌వండి: PGCIL Recruitment 2022: పవర‌ గ్రిడ్ లో 800 ఫీల్డ్‌ ఇంజనీర్, సూపర్‌వైజర్‌ పోస్టులు..

ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో.. బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు పాస్‌ మార్కులు సాధిస్తే సరిపోతుంది. డిజైన్‌/ఇంజనీరింగ్‌/కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఐటీ సిస్టమ్స్‌/నెట్‌వర్కింగ్‌లో కనీసం ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఫీల్డ్‌ ఇంజనీర్‌(ఐటీ)

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో.. బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) 55శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీ అభ్యర్థులు పాస్‌ మార్కులు సాధిస్తే సరిపోతుంది. డిజైన్‌/ఇంజనీరింగ్‌/కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ఐటీ సిస్టమ్స్‌/నెట్‌వర్కింగ్‌లో కనీసం ఏడాదిపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రికల్‌)

ఈ పోస్టులకు ఎలక్ట్రికల్‌ లేదా తత్సమాన విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌ అభ్యర్థులు 55శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణులైతే సరిపోతుంది. కన్‌స్ట్రక్షన్‌/టెస్టింగ్‌ అండ్‌ కమిషనింగ్‌/ఓ అండ్‌ ఎం ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ వర్క్స్‌ ఇన్‌ రూరల్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌(టీఎల్‌ఎస్‌)/ట్రాన్స్‌మిషన్‌ సబ్‌–స్టేషన్స్‌(ఎస్‌/ఎస్‌)లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈ వంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలున్న అభ్యర్థులు డిప్లొమా చేసినా చేయకపోయినా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.

ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌)

ఈ పోస్టుకు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/తత్సమాన విభాగంలో.. డిప్లొమా కోర్సు ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. జనరల్‌ కేటగిరీకి చెందిన అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు పాస్‌ మార్కులు పొందితే సరిపోతుంది. బీఈ/బీటెక్‌/ఎంటెక్‌/ఎంఈ వంటి ఉన్నత సాంకేతిక విద్యార్హతలున్న అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు.

చ‌ద‌వండి: ONGC MRPL Recruitment 2022: ఓఎన్‌జీసీ, ఎంఆర్‌పీఎల్, మంగళూరులో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఎంపిక ఇలా

ఫీల్డ్‌ ఇంజనీర్‌ పోస్టులకు సంబంధించి అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం స్క్రీనింగ్‌ టెస్టును నిర్వహించి, మెరిట్‌ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. స్క్రీనింగ్‌ టెస్ట్‌ కాల వ్యవధి ఒక గంట. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో భాగంగా టెక్నికల్‌ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్‌ టెస్టులు నిర్వహిస్తారు. టెక్నికల్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌లో ఇంజనీరింగ్‌ సిలబస్‌ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 25 ప్రశ్నలుంటాయి. ఇందులో లాజికల్‌ రీజినంగ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, కాంప్రహె న్షన్, వొకాబ్యులరీ, డేటా సఫీషియెన్సీ, నంబర్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. ప్రశ్నలు ఎంసీక్యూ విధానంలో ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. రుణాత్మక మార్కులు లేవు.

కనీస మార్కులు

అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్ట్‌లో కనీసం 40 శాతం అర్హత మార్కులుగా సాధించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీల వారు 30శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారితో ఫైనల్‌ లిస్ట్‌ రూపొందించి, ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూలో కటాఫ్‌

ఇంటర్వ్యూలో కూడా అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు కనీసం 40శాతం అర్హత మార్కులుగా సాధించాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీల వారు కనీసం 30శాతం మార్కులు సాధించాలి. స్కిల్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషలను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 11.12.2022
  • వెబ్‌సైట్‌: http://www.powergrid.in

చ‌ద‌వండి: SAIL Recruitment 2022: సెయిల్, భిలాయ్‌లో 259 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 11,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories