Diploma Trainee Posts: ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్‌లో 54 ఖాళీలు
భారత ప్రభుత్వ రంగ అణుశక్తి విభాగానికి చెందిన ముంబైలోని ఐఆర్‌ఈఎల్ (ఇండియా) లిమిటెడ్.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ ట్రెయినీ (ఫైనాన్స్, హెచ్‌ఆర్)–13, డిప్లొమా ట్రెయినీ (టెక్నికల్)–18, జూనియర్ సూపర్‌వైజర్–01,పర్సన ల్ సెక్రటరీ–02, ట్రేడ్స్‌మెన్ ట్రెయినీ(ఐటీ)–20.
అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్/సీఎంఏ ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేట్(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 26ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 25,000 నుంచి రూ.88,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021
వెబ్‌సైట్: https://www.irel.co.in
Qualification | 10TH |
Last Date | October 05,2021 |
Experience | 1 year |
For more details, | Click here |