Skip to main content

NCL Recruitment 2022: ఎన్‌సీఎల్‌లో 405 ఉద్యోగాలు.. రాత పరీక్ష ఇలా..

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు చాలానే ఉన్నాయి. అందులో దేనికదే ప్రత్యేకం. అలాంటి వాటిల్లో ఒకటి.. నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌(ఎన్‌సీఎల్‌). ప్రస్తుతం ఈ సంస్థ 405 మైనింగ్‌ సర్ధార్, సర్వేయర్‌ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Northern Coalfields Limited

మొత్తం పోస్టులు-405

  • మైనింగ్‌ సర్దార్‌ ఇన్‌ టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌(సి)-374
  • సర్వేయర్‌ ఇన్‌ టెక్నికల్‌ అండ్‌ సూపర్‌వైజరీ గ్రేడ్‌(బి)-31

వేతనాలు
ఈ పోస్టులకు ఎంపికైన మైనింగ్‌ సర్దార్‌లకు ప్రతి నెల రూ.31,852, సర్వేయర్‌ నెలకు రూ.34,391 వేతనంగా లభిస్తుంది.

అర్హతలు
మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు మెట్రిక్యులేషన్‌/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. డీజీఎంఎస్‌ జారీ చేసిన మైనింగ్‌ సర్దార్‌ సర్టిఫికేట్, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికేట్, ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. లేదా మైనింగ్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా, ఓవర్‌మ్యాన్స్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికేట్, ఫస్ట్‌ ఎయిర్‌ సర్టిఫికేట్‌ కలిగి ఉండాలి.

ఎంపిక ఇలా
రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో పరీక్షను నిర్వహిస్తారు. రెండు పోస్టులకు వేర్వేరుగా పరీక్షలు ఉంటాయి. వీటిలో సాధించిన స్కోరు ఆధారంగా ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష
ఈ పరీక్షను 100 మార్కులకు 90 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు. ఇందులో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-ఎలో టెక్నికల్‌ నాలెడ్జ్‌కు సంబంధించి 70 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు(ఎంసీక్యూ) ఇస్తారు. సెక్షన్‌-బిలో జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 30 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. రుణాత్మక మార్కులు లేవు.

సిలబస్‌- మైనింగ్‌ సర్దార్‌కు

  • సెక్షన్‌-ఎ: ఈ విభాగానికి సంబంధించి  ఓపెన్‌కాస్ట్‌ కోల్‌ మైన్‌ వర్కింగ్, షాట్‌ ఫైరింగ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్, సేఫ్టీ ఇష్యూస్, ప్రిలిమినరీ ఐడియా అబౌట్‌ రిక్లమేషన్‌ ఆపరేషన్‌ ఇన్‌ ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్, ప్రిలిమినరీ అండర్‌ స్టాండింగ్‌ అబౌట్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ ప్లాన్, ప్రొవిజన్స్‌ ఆఫ్‌ కోల్‌మైన్స్‌ రెగ్యులేషన్స్, రైటింగ్‌ ఆఫ్‌ రిపోర్ట్స్‌ తదితర అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. 
  • సెక్షన్‌-బి: జనరల్‌ నాలెడ్జ్‌: ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, ఇతర దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలు, జనరల్‌ సైన్స్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  • జనరల్‌ అవేర్‌నెస్‌: స్పోర్ట్స్, డిఫెన్స్, బుక్స్, అవార్డ్స్, భారతదేశం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.
  • రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ, సినానిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్‌ (హిందీ/ఇంగ్లిష్‌), గ్రామర్‌ రిలేషన్‌షిప్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: వర్క్‌ రిలేషన్‌షిప్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, స్పీడ్‌ తదితరాల నుంచి ప్రశ్నలుంటాయి.

కటాఫ్‌ మార్కులు

  • మైనింగ్‌ సర్దార్‌ పోస్టుకు అన్‌ రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు అర్హత పొందాలంటే.. కనీసం 50 మార్కులు; ఎస్సీ/ఎస్టీ, ఈఎస్‌ఎం, ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులైతే 40 మార్కులు సాధించాలి. సర్వేయర్‌ పోస్టుకు కూడా కటాఫ్‌ మార్కులు ఇదే విధంగా ఉంటాయి.
  • సీబీటీ ఫలితాలను ఎన్‌సీఎల్‌ వెబ్‌సైట్‌లో ప్రకటస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. ఆయా తేదీ, సమయాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తారు.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 22.12.2022
  • వెబ్‌సైట్‌: http://nclcil.in/

చ‌ద‌వండి: IOCL Recruitment 2022: ఐఓసీఎల్, ముంబైలో 1746 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date December 22,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories