Skip to main content

GAIL Non Executive Posts : గెయిల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

న్యూఢిల్లీలోని గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌) దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న గెయిల్‌ వర్క్‌ సెంటర్లు/యూనిట్‌లలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non Executive Posts at Gas Authority of India Ltd  GAIL recruitment announcement for non-executive roles  GAIL non-executive positions application details GAIL job vacancies for non-executive staff

»    మొత్తం పోస్టుల సంఖ్య: 391.
»    పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీర్‌(కెమికల్‌)–02, జూనియర్‌ ఇంజనీర్‌ (మెకానికల్‌)–01, ఫోర్‌మ్యాన్‌(ఎలక్ట్రికల్‌)–01, ఫోర్‌మ్యాన్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–14, ఫోర్‌మ్యాన్‌(సివిల్‌)–06, జూనియర్‌ సూపరింటెండెంట్‌(అఫీషియల్‌ లాంగ్వేజ్‌)–05, జూనియర్‌ కెమిస్ట్‌–08, జూనియర్‌ అకౌంటెంట్‌–14, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ల్యాబొరేటరీ)–03, ఆపరేటర్‌(కెమికల్‌)–73, టెక్నీషియన్‌(ఎలక్ట్రికల్‌)–44, టెక్నీషియన్‌(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)–45, టెక్నీషియన్‌(మెకానికల్‌)–39, టెక్నీషియన్‌(టెలికాం–టెలిమెట్రీ)–11, ఆపరేటర్‌(ఫైర్‌)–39, ఆపరేటర్‌(బాయిలర్‌)–08, అకౌంట్స్‌ అసిస్టెంట్‌–13, బిజినెస్‌ అసిస్టెంట్‌–65.
»    అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎస్, బీబీఎం, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంకాం, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు రూ.35,000 నుంచి రూ.1,38,000, జూనియర్‌ సూపరింటెండెంట్, జూనియర్‌ కెమిస్ట్, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు రూ.29,000 నుంచి రూ.1,20,000. మిగిలిన పోస్టులకు రూ.24,500 నుంచి రూ.90,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్‌/స్కిల్‌ టెస్ట్, ఫిజికల్‌ ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 08.08.2024.
»    ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.09.2024.
»    వెబ్‌సైట్‌: https://gailonline.com

Top Universities And Colleges 2024 in India : దేశంలో టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇవే.. వీటిలో చ‌దివితే..!

Published date : 13 Aug 2024 11:43AM

Photo Stories