Skip to main content

Top Universities And Colleges 2024 in India : దేశంలో టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు ఇవే.. వీటిలో చ‌దివితే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా వరుసగా 6 ఏడాది కూడా అగ్ర స్థానంలో ఐఐటీ మద్రాస్‌ నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
Top Universities And Colleges 2024 in India  Union Education Department releases list of top educational institutions on August 12  IISC Bangalore ranked best university in India IIT Madras ranked best educational institution in the country for 6 years IIT Madras ranked best educational institution in the country for 6 years

దేశంలో ఉత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ ఆగ‌స్టు 12వ తేదీన (సోమవారం) విడుదల చేసింది. 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌ రూపొందించిన ఈ జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఆగ‌స్టు 12వ తేదీన (సోమవారం) విడుదల చేశారు. యూనివర్సిటీలు, కాలేజీలు, రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్లు, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మసీ, మెడికల్‌ ఇలా మొత్తం 13 విభాగాల్లో ర్యాంకులకు ప్రకటించారు. 

 Motivational Story : మాది నిరుపేద కుటుంబం.. ఏడాది కాలంలో ఈ మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల‌ను కొట్టానిలా.. కానీ..

ఉన్నత విద్యాసంస్థల్లో టాప్ ఇవే..

iit madras

☛➤ ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో ఉంది. 
☛➤ ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానంలో ఉంది. 
☛➤ ఐఐటీ బాంబే మూడో స్థానంలో ఉన్నాయి. టాప్‌ 10లో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్‌ దిల్లీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చోటు దక్కింది. 

టాప్ విశ్వవిద్యాలయాల ఇవే..  
☛➤ ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానంలో ఉంది.
☛➤ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉంది. 
☛➤ జామియా మిలియా ఇస్లామియా మూడో స్థానంలో ఉంది.

మేనేజ్‌మెంట్‌ విభాగంలో టాప్‌.. 
☛➤ ఐఐఎం అహ్మదాబాద్ మొద‌టి స్థానంలో నిలిచింది. 
☛➤ ఐఐఎం బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. 
☛➤ ఐఐఎం కోళికోడ్ మూడో స్థానంలో నిలిచింది. 

మెడిక‌ల్ విభాగంలో టాప్‌.. :
☛➤ దిల్లీలోని ఎయిమ్స్‌ మొదటి స్థానంలో నిలిచింది. 
☛➤ చండీగఢ్‌లోని పోస్ట్‌గ్యాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌) రెండో స్థానం దక్కించుకుంది.  
☛➤ వేలూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ రెండో స్థానంలో నిలిచింది.

☛ Constable Jobs Notification 2024 : ఈ నెల చివ‌రిలోనే భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. మొత్తం పోస్టులు ఇవే...!

ఫార్మసీ విభాగంలో టాప్‌..:
☛➤ జామియా హమ్‌దర్ద్‌ (దిల్లీ) మొదటి స్థానంలో ఉంది. 
☛➤ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ రెండో స్థానం దక్కించుకుంది. 
☛➤ బిట్స్‌ పిలానీ మూడో స్థానంలో నిలిచింది.

టాప్ కాలేజీల వివ‌రాలు ఇవే..
☛➤ హిందూ కాలేజీ మొదటి స్థానంలో ఉంది. 
☛➤ మిరాండా కాలేజీ రెండో స్థానంలో ఉంది.  
☛➤ సెయింట్ స్టీఫెన్‌ కాలేజీ మూడో స్థానంలో ఉంది 

ఇంజినీరింగ్ టాప్ ఇవే..
ఐఐటీ మద్రాస్‌ వరుసగా 9వ సారి మొదటి స్థానం దక్కించుకుంది. ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఐఐటీ హైదరాబాద్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.

డెంటల్ విభాగంలో టాప్‌..:
☛➤ చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ మొదటి స్థానంలో నిలిచింది. 
☛➤ మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రెండో స్థానంలో ఉంది 
☛➤ దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెన్స్ మూడో స్థానంలో నిలిచింది.

☛ Success Story : ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే.. 4 ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. కానీ..

పరిశోధన టాప్ విద్యాసంస్థలు ఇవే.. 
☛➤ ఐఐఎస్‌సీ బెంగళూరు మొద‌టి స్థానంలో ఉంది. 
☛➤ ఐఐటీ మద్రాస్ రెండో స్థానంలో ఉంది. 
☛➤ ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో నిలిచింది

వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో టాప్‌.. 
☛➤ ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (దిల్లీ) మొద‌టి స్థానంలో ఉంది. 
☛➤ కర్నాల్‌లోని ఐసీఏఆర్ రెండో స్థానంలో ఉంది.
☛➤ లూధియానాలోని పంజాబ్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ మూడో స్థానంలో ఉంది.

☛ Telangana Job Calendar 2024 Released : గుడ్‌న్యూస్‌.. జాబ్‌ కేలండర్ విడుద‌ల‌.. భర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే..!

ఆవిష్కరణల విభాగంలో.. 
☛➤ ఐఐటీ బాంబే మొద‌టి స్థానంలో ఉంది.  
☛➤ ఐఐటీ మద్రాస్ రెండో స్థానంలో ఉంది. 
☛➤ ఐఐటీ హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది

స్టేట్‌ పబ్లిక్‌ యూనివర్సిటీల్లో టాప్‌.. 
☛➤ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ మొదటి ర్యాంక్‌ సాధించింది. 
☛➤ హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆరు, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఏడు స్థానాలు దక్కించుకున్నాయి.

➤☛ 40000 Above Central Government Jobs 2024 : నిరుద్యోగులకు పండ‌గే పండ‌గ‌.. మ‌రో 40000ల‌కు పైగా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌..! వివ‌రాలు ఇవే..

న్యాయవిద్య టాప్‌లో.. 
☛➤ బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా వర్సిటీ మొద‌టి స్థానంలో ఉంది.  
☛➤ దిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ రెండో స్థానంలో నిలిచింది. 
☛➤ హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్ లా మూడో స్థానంలో నిలిచింది.

ఆర్టిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌లో టాప్‌.. 
☛➤ ఐఐటీ రూర్కీ మొద‌టి స్థానంలో నిలిచింది. 
☛➤ ఐఐటీ ఖరగ్‌పూర్ రెండో స్థానంలో ఉంది.  
☛➤ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మూడో స్థానంలో ఉంది.

☛ Family Success Story : ఈ పేదింటి బిడ్ద‌లు.. చ‌దువును ఆయుధంగా చేసుకున్నారు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టారిలా.. కానీ..

విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్రం ప్రకటిస్తోంది. అలాగే ఈ యూనివర్సిటీలు, కాలేజీల‌లో చ‌దివితే విద్యార్థుల కెరీర్‌, ఉద్యోగావ‌కాశాలు మంచి ఉండే అవ‌కాశం ఉంది.

ఇంకా పూర్తి వివ‌రాల‌కు : 
https://www.nirfindia.org/Rankings/2024/Ranking.html క్లిక్ చేయండి

Published date : 13 Aug 2024 08:41AM

Photo Stories