Free Training: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే శిక్షణ
రాయచోటి టౌన్: కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి కడప కెనరా బ్యాంక్ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సెల్‌ఫోన్ రిపేర్, సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్ రిపేర్, సర్వీసింగ్, ఏసీ రిపేర్, వంటి వాటిపై ఏప్రిల్ 22వ తేది నుంచి 30 రోజులు పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
Amul Milk: విదేశీ మార్కెట్లలో అమూల్ పాలు.. తొలిసారిగా ఇక్కడే!
18 నుంచి 45 ఏళ్లలోపు నిరుద్యోగులు అర్హులని తెలిపారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత భోజనం, బస్సు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని నేరుగా వచ్చి కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ వద్దకు వెళ్లి సంప్రదించవచ్చుని వివరించారు. అలాగే దరఖాస్తులు cbrretikadapa@fmai.com ఈ మెయిల్‌కు పంపాలని తెలిపారు. వివరాల కోసం 9440905478 /9985606866 /9440933028 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
TS Inter Results: ‘స్పాట్’ కేంద్రాల్లోకి మొబైల్ నో.. ఈసారి ఫలితాలు ఇలా!