Free Training: ఈ కోర్సుల్లో 30 రోజులపాటు ఉచిత శిక్షణ..

చంద్రగిరి: యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 30 రోజుల పాటు పురుషులకు ఉచితంగా పొటోగ్రఫీ, వీడియోగ్రఫీపై శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. సురేష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన పురుషులు శిక్షణకు అర్హులన్నారు. కనీసం విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు.
Students Health: చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ముఖ్యం
శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనం, రాను పోను ఒక్కసారి చార్జీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి వారి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట, చంద్రగిరి. 79896 80587, 94949 51289, 63017 17672 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Carrom Championship: క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు
Tags
- employment offers
- Free training
- courses for men
- photography course
- training for job opportunity
- applications for training
- Free Coaching
- Union Bank Rural Self Employed Training Institute
- Job Opportunity
- Job News
- deadline for applications
- Education News
- chittoor news
- UnionBank
- TrainingInstitute
- chandragiri
- photography
- Videography
- Qualifications
- Applications
- Sakshi Education Latest News