Students Health: చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ కూడా ముఖ్యం
లబ్బీపేట: విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే విద్యపై శ్రద్ధ చూపగలుగుతారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అన్నారు. రక్తహీనత నివారణకు అందించే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పిల్లలకు క్రమం తప్పక ఉపయోగించేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. పటమటలోని కోనేరు బసవ పున్నయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Intermediate Public Exams 2024: ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం
విద్యార్థినులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి, ఎనీమియా శాతాన్ని నమోదు చేసి, రక్తహీనతను నివారించేందుకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో భాగంగా 947 కేంద్రాల ద్వారా 5,23,188 పింక్ కలర్ చిన్న మాత్రలు, 9,24,973 బ్లూ కలర్ పెద్ద మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఐరన్ మాత్రలు తీసుకునేలా ఉపాధ్యాయులు నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన మాత్రల ఫలితంగా విద్యార్థుల్లో రక్తహీనత శాతం క్రమంగా తగ్గిందన్నారు.
పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించనున్న నేపథ్యంలో మాత్రల వాడకం నిరంతరంగా జరగాలనే ఉద్దేశంతో ఆరు వారాలకు సరిపడా ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ మాత్రలను విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేసి క్రమం తప్పకుండా వినియోగించేలా చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని, ఆర్బీఎస్‌కే ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి మాధవి, విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కేవీఎల్‌ఎన్ కుమార్, పాఠశాల హెచ్‌ఎం ప్రేమసాగర్, డీపీఎంఓ డాక్టర్ నవీన్, యూపీహెచ్‌సీ వైద్యుడు నిహారిక, డాక్టర్ ఉస్మాన్ పాల్గొన్నారు.
IIT Students: ఐఐటీ విద్యార్ధులకు దక్కని జాబ్ ఆఫర్లు.. కారణం ఇదే..